Vijay Sai Reddy Apologises : నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా : ఎంపీ విజయసాయి రెడ్డి
Vijay Sai Reddy (File Photo)
Vijay Sai Reddy Apologises :నిన్న రాజ్యసభ ఛైర్మన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని మందలించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. రాజ్యసభ ఛైర్మన్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నిన్న జరిగింది నిందనీయ చర్య అని ఆయన అన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు ప్రహ్లాద్ జోషి.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందెప్పుడూ ఇలాంటివి చూడలేదన్నారు. సభాధ్యక్షుడిని పనిచేయకుండా నిలువరించేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారన్నారు వెంకయ్యనాయుడు.వాటికి నేను లొంగే ప్రసక్తే లేదన్నారు. నా మనసు ఈ దేశం, రాజ్యాంగం, ప్రజలతో ముడిపడి ఉంది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యల గురించి నేనేమీ పట్టించుకోను అని వెంకయ్యనాయుడు అన్నారు.
మరోవైపు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నేతలు కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీల సభ్యులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు.
ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ కూడా అన్నారు. ఇక బాధ్యులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బిజూ జనతాదళ్ సభాపక్ష నేత ప్రసన్న ఆచార్య డిమాండ్ చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com