ghosts exist: దెయ్యాలు ఉన్నాయి.. లేవని ఎవరన్నారు: ఐఐటీ ప్రొఫెసర్

Ghost Exists: దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దెయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా నమ్మాలి అంటారు.. దేవుళ్లు, దయ్యాలు ఏం లేవు.. అవన్నీ వట్టి మాటలు అని కొట్టి పారేసే వాళ్లూ ఉన్నారు.. ఎవరి నమ్మకాలు వారివి.. బాగా చదువుకున్న ఓ ఐఐటీ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెర మాత్రం దెయ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. పైగా తాను మంత్రాలు, శ్లోకాలు పఠించి వచ్చిన వాటిని తరిమికొట్టేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
తన జీవితంలో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా చెబుతారు.. 1993లో చెన్నైలో నివసించే తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టశక్తులు ఏడిపించాయని చెప్పాడు. తాను అప్పుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లి హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని పఠించడంతో పాటు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేమితుడి భార్యని, అతడి తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించేవారని చెప్పారు.
ఇలా ఓ ఐటెటీ ఫ్రొఫెసరే దెయ్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతోంది. లెర్న్ గీత లైవ్ గీత పేరుతో యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. బెహరా ఎలక్ట్రిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్.. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్‌డీ కూడా చేయడమే కాక రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రొఫెసర్ కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com