సీఎంగారు ఎందుకలా మాట్లాడుతున్నారు.. 20 మందిని కనాలా!!

సీఎంగారు ఎందుకలా మాట్లాడుతున్నారు.. 20 మందిని కనాలా!!
X
వచ్చీ రావడంతోనే వివాదాలకు ఆధ్యబిందువు అయ్యారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్.

వచ్చీ రావడంతోనే వివాదాలకు ఆధ్యబిందువు అయ్యారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. మార్చి 10న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం ఆ రాష్ట్రప్రజల దృష్టినే కాక దేశ ప్రజలంతా తనవైపు చూడాలనుకున్నారో ఏమో.. పనిగట్టుకుని ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న డెహ్రాడూనే యువతులు ధరించే జీన్స్ గురించి కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. తక్కువ మంది పిల్లలుంటే తక్కువ రేషనే వస్తుంది అని అన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

పేద ప్రజలు - వారి పిల్లలకు ఆహారం అందించడం హృదయ విదారకంగా కష్టమైన పని అని సూచించినట్లు అనిపించింది. జనాభా పెరుగుదల గురించి, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు.

రామ్‌నగర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో, "భారతదేశంలో 200 సంవత్సరాల పాలన" గురించి మాట్లాడారు. మాటల మధ్యలో అమెరికాను కూడా నిందించారు. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించడానికి " 200 సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా చేసి అమెరికా చాలా కష్టపడుతోంది" అని ఆదివారం తన ప్రసంగం లో తీరత్ వ్యాఖ్యానించారు.

Tags

Next Story