YouTube: యూట్యూబ్‌లో ఇకపై అవి కనిపించవు..

YouTube: యూట్యూబ్‌లో ఇకపై అవి కనిపించవు..
YouTube: ఎవరైన మన వీడియోకి లైక్ కొడితే సంతోషం కానీ, డిస్‌లైక్ కొడితే బాధగా ఉంటుంది కదా..

Youtube: ఎవరైన మన వీడియోకి లైక్ కొడితే సంతోషం కానీ, డిస్‌లైక్ కొడితే బాధగా ఉంటుంది కదా.. మరి అందరికీ అన్నీ నచ్చాలని లేదు.. కానీ లైక్స్ కంటే డిస్‌లైక్సే ఎక్కువగా ఉంటే.. ఇకపై ఏం చేయాలన్నా మునుపటి ఉత్సాహం ఉండదు.. అవి కౌంట్ అవకపోతే ఎంత బావుండు.. కాస్త ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.

అందుకే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆ ఫీచర్‌లోని కౌంట్ బటన్‌ను తొలగించింది యూట్యూబ్. గత కొంతకాలంగా ఈ ఫీచర్‌ను తొలగించే అంశంపై తర్జన భర్జన పడుతూ ఎట్టకేలకు డిస్‌లైక్ బటన్ కౌంట్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది యూట్యూబ్ యాజమాన్యం.

యూట్యూబ్‌లో కొందరు డిస్‌లైక్‌లతో దాడులు వేధింపులకు పాల్పడడంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంది. డిస్‌లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనవచ్చని యూట్యూబ్ ఆశిస్తోంది.

ఇక యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌కు సైతం డిస్‌లైక్ బటన్ ఉన్నప్పటికీ.. అది కూడా కౌంట్ చూపించదనే విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని కూడా అన్ని వీడియోలకు వర్తింప చేస్తుంది. యూట్యూబ్ తాజా నిర్ణయంతో యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్‌కు ఊరట లభించనుంది.

తమ కోపాన్నంతా డిస్‌‌లైక్ రూపంలో చూపించే వారందరికీ చెక్ పెట్టినట్లు అయింది. అయితే ఈ డిస్‌లైక్ కౌంట్ చూసుకోవాలంటే, ఆ ఫీచర్ కోసం యూట్యూబ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టూడియో గణాంకాల ద్వారా డిస్‌లైక్ కౌంట్‌ను చూసుకునే వెసులుబాటు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story