Zomato: జొమాటో నిర్ణయం సరికాదు: రెస్టారెంట్ యజమానులు

Zomato: జొమాటో నిర్ణయం సరికాదు: రెస్టారెంట్ యజమానులు
Zomato: కస్టమర్లు కోరుకున్న ఫుడ్ ని సకాలంలో అదించడంతో తమ బాధ్యత పూర్తయిందని అనుకోలేదు జొమాటో సంస్థ. ఫుడ్ గురించి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకుంది..

Zomato: కస్టమర్లు కోరుకున్న ఫుడ్ ని సకాలంలో అదించడంతో తమ బాధ్యత పూర్తయిందని అనుకోలేదు జొమాటో సంస్థ. ఫుడ్ గురించి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకుంది.. ఈ మేరకు ఆయా రెస్టారెంట్లకు జొమాటో మెయిల్స్ పెట్టింది. ఆహార నాణ్యతపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పలు రెస్టారెంట్లపై నిషేధం విధించింది. తనిఖీలు నిర్వహించే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని జొమాటో తెలిపింది. అయితే ఈనెల 18 నుంచి వచ్చే ఈ విధానం వల్ల చిన్న చిన్న రెస్టారెంట్లు మూతపడతాయని రెస్టారెంట్ యజమానులు ఆవేదన చెందుతున్నారు.

నిజానికి ఇవన్నీ కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులుగా పరిగణించలేము.. 70 శాతం నకిలీవని ఒక రెస్టారెంట్ యజమాని అంటున్నారు. వినియోగదార్లకు నాసిరకం ఆహార పదార్ధాలు అందకుండా చూడాలన్న జొమాటో ఉద్దేశం మంచిదే కానీ, అది ఏకపక్షంగా ఉండకూడదన్నది రెస్టారెంట్ యజమానులు వినిపిస్తున్న వాదన.

కొందరు రెస్టారెంట్ యజమానులు కూడా కావాలని ఫిర్యాదు చేస్తుంటారని వాటన్నింటినీ స్వీకరించడం సరికాదని చిన్న రెస్టారెంట్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. తమ వ్యాపారంపై ఇలాంటివి ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ నిమిషాల్లో అందాలన్న విషయం పక్కన పెడితే ఫుడ్ లో క్వాలిటీ ఉండడం అనేది చాలా ముఖ్యం.. అదే కస్టమర్లు కోరుకునేది కూడా.. ఒక్కోసారి ఆహారంలో బొద్దింకలు, ఈగల వంటివి వస్తుంటాయి. కస్టమర్ మాంసాహారాన్ని కోరుకుంటే శాకాహారం పంపడం వంటివి జరుగుతుండడంతో జొమాటో కొన్ని రెస్టారెంట్లపై నిషేధం విధించింది.

Tags

Read MoreRead Less
Next Story