న్యూ ఇయర్‌ ఎఫెక్ట్ .. జొమాటోకు నిమిషానికి 4,100 ఆర్డర్లు

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్ .. జొమాటోకు నిమిషానికి 4,100 ఆర్డర్లు
జొమాటోకు దేశవ్యాప్తంగా నిన్న నిమిషానికి 4,100 ఆర్డర్లు వచ్చినట్లుగా అయన తెలిపారు. అయితే కస్టమర్లు ఎక్కువగా పిజ్జాలు, బిర్యానీలే ఆర్డర్ చేశారట..

కరోనా సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతున్నారు ప్రజలు.. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్‌ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో ఎక్కువమంది ఇంటిదగ్గరే కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఈ విషయాన్నీ ఆ కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.

జొమాటోకు దేశవ్యాప్తంగా నిన్న నిమిషానికి 4,100 ఆర్డర్లు వచ్చినట్లుగా అయన తెలిపారు. అయితే కస్టమర్లు ఎక్కువగా పిజ్జాలు, బిర్యానీలే ఆర్డర్ చేశారట.. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ దృష్ట్యా గిరాకీ పెరిగిందని చెప్పారు. కరోనా వేళ హోటళ్లకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడని ప్రజలు ఫుడ్ ను ఇంటికే తెప్పించుకుని లాగించేశారని తెలిపారు. నిమిషాల్లో వేలల్లో ఆర్డర్లు రావడంతో ఉద్యోగులందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారని తెలిపారు.


Tags

Next Story