Zomoto : డెలివరీ బాయ్స్ కోసం 'ది షెల్టర్ ప్రాజెక్ట్'

Zomoto : డెలివరీ బాయ్స్ కోసం ది షెల్టర్ ప్రాజెక్ట్
కస్టమర్స్ ఆకలిని తీర్చి అలసిపోయిన డెలివరీ బాయ్స్ రెస్ట్ తీసుకునేందుకు వీటిని రూపొందించారు

డెలివరీ బాయ్స్ కోసం 'ది షెల్టర్ ప్రాజెక్ట్' ను తీసుకొచ్చింది జోమాటో. కస్టమర్స్ ఆకలిని తీర్చి అలసిపోయిన డెలివరీ బాయ్స్ రెస్ట్ తీసుకునేందుకు వీటిని రూపొందించారు. ఈ షెల్టర్ స్టాప్ లలో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పటికే గుర్గావ్ లో రెండు రెస్ట్ పాయింట్లను ప్రారంభించినట్లు తెలిపారు జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్. బిజీ ఏరియాలలో మరిన్ని షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వివిధ కంపెనీల డెలివరీలను అందజేయడంలో.. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అలిసిపోతారని అన్నారు.

షెల్టర్ ప్రాజెక్ట్ పై డెలివరీ బాయ్స్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు దీపిందర్. ఈ షెల్టర్ల ద్వారా డెలివరీ బాయ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ రెస్ట్ పాయింట్లు డెలివరీల మధ్య విరామం తీసుకునే స్థలం మాత్రమే కాదని, స్వచ్చమైన త్రాగునీరు. ఫోన్ చార్జింగ్ స్టేషన్ లు, వాష్ రూంలు, హైస్పీడ్ ఇంటర్నేట్, 24 * 7 హెల్ప్ డెస్క్, ప్రథమ చికిత్సను కూడా ఉండనుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story