Sri Lanka President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘే.. 134 మంది ఎంపీల మద్దతుతో..
Sri Lanka President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకే మెజార్టీ ఎంపీలు మద్దతు తెలిపారు. మొత్తం 225 మంది ఎంపీల్లో 134 మంది విక్రమసింఘేకే సపోర్ట్ చేశారు. దీంతో మ్యాజిక్ మార్క్ 113ను ఆయన సులభంగానే దాటేసారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘే ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
దేశంలో సంక్షోభంలో ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. శ్రీలంక ఎనిమిదవ అధ్యక్షుడిగా ఆయన ఇప్పుడు ఆ పదవి చేపట్టబోతున్నారు. మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ అనుర కుమార దిస్సనాయకే కూడా అధ్యక్ష పదవికి పోటీ పడినా చివరికి రణిల్ విక్రమసింఘకే మెజార్టీ ఎంపీలు మద్దతు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com