Pakistan: ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 20 మంది సజీవ దహనం..

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురకి తీవ్ర గాయలాయ్యాయి. ఈ ఘటన పంజాబ్‌లోని ముల్తాన్‌లో జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.
మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హాహాకారాలు చేస్తూనే మంటల్లో కాలిపోయారు. ఘటానాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. అతికష్టం మీద మంటలను ఆర్పేశారు. దీంతో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే వీరిని నిర్ధారించాల్సి ఉంటుందన్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com