Pakistan: పొగమంచు.. 22 మంది ప్రాణాలను బలిదీసుకుంది..

Pakistan: పొగమంచు.. 22 మంది ప్రాణాలను బలిదీసుకుంది..
Pakistan: హిల్‌ స్టేషను ముర్రేలో భారీగా మంచు కురిసి ఏకంగా 22 మంది మరణించారు.

Pakistan: పాకిస్థాన్‌లో భారీగా కురిసిన మంచు.. 22 మంది ప్రాణాలను బలి తీసుకుంది. హిల్‌ స్టేషను ముర్రేలో భారీగా మంచు కురిసి ఏకంగా 22 మంది మరణించారు. దీంతో ముర్రేని విపత్కర ప్రాంతంగా పేర్కొంటూ ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్‌ ప్రభుత్వం. మృతుల్లో 10 మంది పిల్లలు, ఇస్లామాబాద్‌ కు చెందిన పోలీస్‌ అధికారి నవీద్‌ ఇక్బాల్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.

వీరంతా హితపాతం నడుమ వాహనాల్లో చిక్కుకుపోయి.. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి… ఊపిరాడక మరణించారు. ఈ ఘటనపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్‌ ప్రావిన్సులోని మనోహర పర్యటక ప్రాంతం ముర్రే. ఇస్లామాబాద్‌ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 8 డిగ్రీలకు పడిపోయాయి.భారీగా మంచు కురుస్తుండటంతో.. ఈ ప్రాంతాన్ని చూడాటానికి అనేక మంది పర్యాటకులు వచ్చారు.

వర్షంలా కురిసిన మంచులో కొన్ని కార్లు చిక్కుకుపోయాయి. ముందుకు గానీ వెనక్కి గాని కదలటానికి వీల్లేకుండా నిలిచిపోయాయి. ఆ హిమపాతానికి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి కార్లు కదలకుండా నిలిచిపోయాయి. ఆ కార్లలోఉన్నవారు చనిపోయారు. హిల్ స్టేషన్ ముర్రీ పట్టణంలో కురుస్తున్న హిమపాతపు అందాల్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు చనిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.

Tags

Read MoreRead Less
Next Story