Bangkok: 21 ఏళ్లుగా భార్య శవంతోనే భర్త.. ఇన్నాళ్లకు అంత్యక్రియల కోసం..

Bangkok: 21 ఏళ్లుగా భార్య శవంతోనే భర్త.. ఇన్నాళ్లకు అంత్యక్రియల కోసం..
Bangkok: బ్యాంకాక్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులతో సంతోషంగా జీవించేవాడు.

Bangkok: కొన్ని బంధాలను చనిపోయిన తర్వాత కూడా ఎవరూ విడదీయలేరు. అలా అని చనిపోయిన వారి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని దానితో జీవించే వారు ఉంటారా..? ఉన్నారు.. బ్యాంకాక్‌లో ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 21 ఏళ్ల పాటు భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇన్నాళ్లకి ఆ వ్యక్తి ఈ విషయాన్ని తానే స్వయంగా బయటపెట్టాడు.

బ్యాంకాక్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులతో సంతోషంగా జీవించేవాడు. అదే సమయంలో పలు ఆరోగ్య కారణాల వల్ల తన భార్య మృతిచెందింది. చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని ఓ శవపేటికలో పెట్టి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. కొన్నాళ్లకు తన ప్రవర్తన వల్ల విసిగిపోయిన కొడుకులు కూడా తనను వదిలేసి వెళ్లిపోయారు. భార్య చనిపోయి 21 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ ఆ శవపేటికలోని శవం అలాగే ఉంది.

ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం తప్పనిసరి అని తెలుసుకున్న ఆ వ్యక్తి.. ఇన్నాళ్లకు తన భార్యకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకు తెలిసిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్‌‌ను సంప్రదించి తన భార్యకు అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. వారు అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత తానొక వ్యాపార పని మీద బయటికి వెళ్తున్నానని.. తిరిగి ఇంటికి వచ్చేస్తానని మటిస్తున్నానని తన భార్య శవంతో చెప్పడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.

Tags

Read MoreRead Less
Next Story