Afghanistan Suicide Blast : రష్యా దౌత్యకార్యాలయంలో సూసైడ్ బాంబర్ అటాక్.. 25 మంది మృతి..

Afghanistan Suicide Blast : ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతిచెందారు.. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగ శాఖ ధ్రవీకరించింది.. కాబూల్‌లోని దౌత్య కార్యాలయం బయట ఈ పేలుడు జరిగినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది.. వీసాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది.
ఓ వ్యక్తి బాంబును శరీరానికి ధరించి వచ్చి పేల్చుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ఆఫ్గనిస్థాన్‌లో దౌత్యకార్యాలయం నిర్వహిస్తున్న అతి కొద్ది దేశాల్లో రష్యా ఒకటి.. ఇప్పటి వరకు ఈ దాడిపై తాలిబన్లు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
At least 25 people have been killed in the terrorist attack to the Embassy of #Russia in #Kabul, #Afghanistan. pic.twitter.com/sTFwbNS0km
— Like Rst ✊☠ (@rst_like) September 5, 2022
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com