Amazon : ఉద్యోగాల కోత

Amazon : ఉద్యోగాల కోత
అమెజాన్, మైక్రోసాఫ్ట్ లో భారీగా లే ఆఫ్ లు; దిక్కుతోచని పరిస్థితుల్లో ఉద్యోగులు...



అమెజాన్, మైక్రో సాఫ్ట్ సంస్థలలో ఉద్యోగాల కోత మొదలైంది. అమెజాన్ లో 18వేలు, మైక్రోసాఫ్ట్ లో 10వేల ఉద్యోగాలను తీసివేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ఇప్పటికే 2,300 ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఎక్కువ మంది కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. గత నవంబర్ నుంచి అమెజాన్ తొలగింపులను ప్రారంభించింది.

అమెజాన్ సీఈఓ ఆండీ జాన్సీ బుధవారం కంపెనీ వెబ్ సైట్లో మెమోను పోస్ట్ చేశారు. తొలగింపులకు గురైన వారికి మూడునెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్ లో దాదాపు వెయ్యి మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 18వేల మంది ఉద్యోగులను తీసివేయనుంది అమెజాన్.

మైక్రోసాఫ్ట్ లోనూ ఉద్యోగాల కోత....

10వేల మంది ఎద్యోగులను తీసివేయనున్నట్లు ప్రకటించారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. తొలగింపులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికి.. కీలకమైన విభాగాల్లో నియామకాలు జరుపుతామని అన్నారు. ఉద్యోగాలను కోల్పోయిన వారికి ఇది కష్టసమయమని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాలలో ఆర్థిక మాంద్యం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story