America: ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..

America: ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..
America: రష్యా సైనిక చర్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు అమెరికా సిద్ధమైంది.

America: రష్యా సైనిక చర్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. ఉక్రెయిన్‌కు హైటెక్, మీడియం రేంజ్​రాకెట్​ వ్యవస్థలను పంపాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. అత్యాధునిక రాకెట్‌ లాంఛర్ల సరఫరాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డాన్‌బాస్‌ ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్న రష్యాను అడ్డుకొనేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌ గురిచూసి దాడి చేసే సామర్థ్యాన్ని అత్యాధునిక రాకెట్లు మరింత పెంచుతాయని తెలిపింది. అయితే తమ రాకెట్లతో రష్యా భూభాగంలో ఎలాంటి దాడులు చేయబోమని ఉక్రెయిన్‌ హామీ ఇచ్చింది. తాము నాటో-రష్యా మధ్య యుద్ధాన్ని కోరుకోవడంలేదని జో బైడెన్‌ అన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. స్వతంత్ర, ప్రజాస్వామిక, సార్వభౌమిక, సంపన్న ఉక్రెయిన్‌ను చూడాలని ఉందని బైడెన్ పేర్కొన్నట్లు తెలిపింది.

మరోవైపు అమెరికా నుంచి అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలు ఈ వారమే ఉక్రెయిన్‌కు చేరుకోనున్నాయి. అయితే ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాలకు రష్యా గట్టి హెచ్చరికలు పంపింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చే దేశాలు.. రష్యా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశ విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌, దాని సరిహద్దులు దాటి దాడులు చేయడాన్ని తాము ఏ మాత్రం ఉపేక్షించమని తేల్చిచెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story