lloyd Austin: అమెరికా రక్షణ మంత్రికి కరోనా.. బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా..

lloyd Austin (tv5news.in)

lloyd Austin (tv5news.in)

lloyd Austin: ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి కోవిడ్ అంటే అందరూ భయపడేలా చేస్తోంది.

lloyd Austin: ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి కోవిడ్ అంటే అందరూ భయపడేలా చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా ఫస్ట్ వేవ్ సమయానికి ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో.. మళ్లీ అలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంటున్నారు. రోజుకు వేలల్లో కాకుండా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక బూస్టర్ డోస్‌ల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అనుకున్న వారిలో కూడా ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి.

ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు కరోనా సోకిందన్న వార్త కలకలం రేపింది. బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా లాయిడ్‌కు కరోనా సోకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని స్వయంగా లాయిడ్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. తనను కలిసిన వారంతా క్వారంటీన్‌లో ఉండాలని కోరారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని, అప్పుడే ఆయనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు.

అమెరికాలో పెరుగుతున్న కేసులను కంట్రోల్ చేయడానికి ఒకే ఒక్క ఆశ బూస్టర్ డోస్. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టలేకపోవడంతో ప్రజలంతా బూస్టర్ డోస్‌పైనే నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక రక్షణ శాఖ మంత్రికి అలా జరగడంతో బూస్టర్ డోస్ ఉపయోంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇలా ఎలా జరిగిందని వైద్య నిపుణులు పరిశోధనలు మొదలుపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story