America Chinook Choppers : చినూక్ హెలికాప్టర్ల వాడకాన్ని నిలిపేసిన అమెరికా.. వివరణ కోరిన భారత్..

America Chinook Choppers : అమెరికా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. చినూక్ సైనిక హెలికాప్టర్లను అర్థాంతరంగా నిలిపివేసింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందన్న ఆందోళన నేపథ్యంలో అమెరికాలో చినూక్ హెలికాప్టర్లు గ్రౌండ్‌కే పరిమితం అయ్యాయి. హెచ్-47 హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగడానికి గల కారణాలను సైన్యం గుర్తించింది. ఒకటి రెండు కాదు 400 చినూక్ హెలికాప్టర్లను అక్కడి మెటీరియల్ కమాండ్ టెంపరరీగా పక్కనపెట్టింది. దీంతో భారత్‌లో ఆందోళన మొదలైంది.
సైనిక దళాల రవాణాలో ఈ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ చాపర్లను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది.. అయితే, ఉన్నట్టుండి అగ్రరాజ్యం వీటి సేవలను అర్థంతరంగా నిలిపివేయడంతో భారత్ ఆందోళన చెందుతోంది.. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు భారత వాయుసేన లేఖ రాసింది.
ఈ చినూక్ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచి దళాల రవాణా, విపత్తు సహాయక చర్యలతోపాటు క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్ చాపర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం హెలికాప్టర్లను ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, భారత్ సహా పలు దేశాలు వినియోగిస్తున్నాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం 15 చినూక్ చాపర్లు సేవలు అందిస్తున్నాయి. గతంలో ఈ హెలికాప్టర్లలో ఇంజిన్ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి.. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.. హనీవెల్ సంస్థ నిర్మించిన కొన్ని రకాల ఇంజిన్లు అమర్చిన హెలికాప్టర్లలో ఈ సమస్య ఉన్నట్లు అమెరికా సైనిక అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఆంక్షలు ఎప్పటి వరకు అమలులో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com