Asteroid QN5 : భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం..

Asteroid QN5 : భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం..
X
Asteroid QN5 : అంతరిక్షంలోని గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయా...! ఆస్టరాయిడ్‌ క్యూఎన్‌ 5 ఇప్పటికే భూమికి సమీపంగా వస్తోందా...?

Asteroid QN5 : అంతరిక్షంలోని గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయా...! ఆస్టరాయిడ్‌ క్యూఎన్‌ 5 ఇప్పటికే భూమికి సమీపంగా వస్తోందా...? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్‌ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్టరాయిడ్ క్యూఎన్‌ 5... భూమికి 8 మిలియన్ కిలోమీటర్ల సమీపంలో కక్ష్యను దాటుతుందని నాసాకు చెందిన ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ వెల్లడించింది.

దీంతో అందరి నజర్‌ అటువైపే మళ్లింది. ఆస్టరాయిడ్‌ క్యూఎన్‌ 5...ఇప్పటికే గంటకు 48వేల కిలోమీటర్లపైగా వేగంతో భూమివైపు దూసుకొస్తున్నట్లు నాసా చెెబుతోంది. ఒక వేళ భూ గురుత్వాకర్షణశక్తి కారణంగా తన కక్ష్య నుంచి ఆస్టరాయిడ్ వైదొలగితే ఊహించని నష్టం వాటిల్లే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంటనా వేస్తున్నారు.

అటు రెండు రోజుల వ్యవధిలోనే భూమిని దాటిన నాల్గో ఆస్టరాయిడ్.. క్యూఎన్‌ 5 అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వరకే మూడు ఆస్టరాయిడ్‌లు భూమికి సమీపంగా ప్రయాణించాయని నాసా స్పష్టంచేస్తోంది.

గతంలో పెను విధ్వంసం సృష్టించిన ఉల్కల అనుభవాల దృష్ట్యా...విశ్వంలోని గ్రహశకలాలు భూ మండలానికి ఎప్పటికైనా డేంజరే అని నాసా అంచనా వేస్తోంది. భూమిపైకి దూసుకవచ్చే వీటిని అంతరిక్షంలోనే స్పేస్‌ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టేందుకు...సరికొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.

అటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలతో డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ మిషన్‌ రెండో ప్రయోగాన్ని వాయిదా వేసిన నాసా...తాజాగా ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి మరో ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్‌ ఐయితే నాసా అంతరిక్ష నౌక... ఈనెల 26న గ్రహశకలం డైమోర్ఫోస్‌ను ఢీకొట్టనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story