Expensive Trash Bag: చెత్తకు ఉపయోగించే బ్యాగ్.. ధర మాత్రం లక్షల్లో..

Expensive Trash Bag: చెత్తకు ఉపయోగించే బ్యాగ్.. ధర మాత్రం లక్షల్లో..
Expensive Trash Bag: బెలన్సియాగా అనే సంస్థ.. ఓ చెత్త బ్యాగ్‌ను తయారు చేసింది. దీని ధర 1,790 డాలర్లుగా నిర్ణయించింది.

Expensive Trash Bag: ఈకాలంలో లగ్జరీగా బతకడం అంటే అన్నీ కాస్ట్‌లీ వస్తువులు ఉపయోగించడం అని అనుకుంటున్నారు చాలామంది. అందుకే రోజు ఉపయోగించే అత్యవసర వస్తువును కూడా సౌకర్యవంతంగా తయారు చేస్తు్న్నారు కొందరు. మామూలు వస్తువుకు కూడా వేలల్లో ధర పెట్టినా కొనేవారు ఉన్నారు. అందుకేనేమో ఓ చెత్తకు ఉపయోగించే బ్యాగ్ కూడా లక్షల్లో ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టారు.

లగ్జరీ వస్తువులు మాత్రమే తయారు చేసే కంపెనీలు.. ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఏ వస్తువు అయినా లగ్జరీగానే ఉండాలని అనుకుంటారు. అలాగే ఆలోచించి బెలన్సియాగా అనే సంస్థ.. ఓ చెత్త బ్యాగ్‌ను తయారు చేసింది. దీని ధర 1,790 డాలర్లుగా నిర్ణయించింది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.1,42,569. అందుకే అత్యంత ఖరీదైన చెత్తకు ఉపయోగించే బ్యాగ్‌గా రికార్డ్ సాధించింది.

ఈ చెత్త బ్యాగ్‌కు అనేక రంగుల్లో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అయితే కొందరు మాత్రం ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది అని కొనాలని ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు. చెత్తకు ఉపయోగించే బ్యాగ్ కోసం అంత ఖర్చు ఎవరైనా ఎలా పట్టగలుగుతారు అని ఆశ్చర్యపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story