Black Snowfall: ఆ ప్రాంతంలో మంచు నల్లగా కురుస్తోంది.. ఎందుకంటే..

Black Snowfall: ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాలు మనుషులను సంతోషపెట్టేలాగా ఉంటాయి. కానీ మానవాళి మాత్రం ఆ ప్రకృతికి ఎప్పటికప్పుడు హాని కలిగిస్తూనే ఉంటారు. దానివల్లే ప్రపంచంలో ప్రకృతి వైపరిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే ఒకటి తాజాగా రష్యాలో వెలుగు చూసింది. రష్యాలోని సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో కురుస్తున్న నల్లని మంచు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మంచు కురుస్తుంటే ఎవరైనా దానిని చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అందుకే చాలామంది హాలీడే వస్తే చాలు మంచు ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. కానీ రష్యాలో కురుస్తున్న నల్ల మంచు మాత్రం అందరినీ భయపెడుతోంది. అయినా మంచు నల్లరంగులో ఎలా కురుస్తుంది అనుకుంటున్నారా..? దానికి అక్కడ బొగ్గు పరిశ్రమలే కారణం.
బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తుంది. దీంతో మసి, దుమ్ము వల్ల కాలుష్యం కూడా బాగా పెరిగింది. దీని వల్ల ఆకాశం నుండి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయి.. నల్లగా కురుస్తుందని స్థానికులు అనుకుంటున్నారు. 2019లో ఒకసారి ఇలాగే జరిగిందని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com