Congo Bridge : కాంగోలో కూలిన కొత్త బ్రిడ్జ్.. వీడియో వైరల్..

Congo Bridge : డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న బ్రిడ్జ్ ను నిర్మించారు.
అయితే ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆమె అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జ్ కిందికి పడిపోతున్న సమయంలో ఆమె ముందుకు దూకడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రారంభోత్సవం రోజునే ఇలా బ్రిడ్జ్ కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యం పై ప్రజలు మండిపడుతున్నారు.
A small bridge collapsed during the inauguration ceremony by officials in the Republic of the #Congo. pic.twitter.com/2Y453IN0Sr
— خالد اسكيف (@khalediskef) September 6, 2022
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com