international

China Taiwan War :చైనాతో యుద్ధానికి సిద్ధమైన తైవాన్..

China Taiwan War : చైనా - తైవాన్ మధ్య యుద్ధ రాగాలు వినిపిస్తున్నాయి

China Taiwan War :చైనాతో యుద్ధానికి సిద్ధమైన తైవాన్..
X

China Taiwan War : చైనా - తైవాన్ మధ్య యుద్ధ రాగాలు వినిపిస్తున్నాయి. యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ రాక ఆ యుద్ధ రాగాలకు కోరస్ జత చేసినట్లయ్యింది. చైనా- తైవాన్ సరిహద్దుల్లో అర్థరాత్రి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల సైనికులు తుపాకులను ఎక్కు పెట్టి సిద్ధంగా ఉన్నారు.

చైనా వార్నింగ్‌లను పట్టించుకోని నాన్సీ తైవాన్‌లో కాలు మోపారు. ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. అమెరికా అభయంతో తైవాన్.. చైనాతో యుద్ధం చేస్తుందా.. నాన్సీ రాకతో గుర్రుగా ఉన్న చైనా ఏం చేయబోతోంది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాస్త శాంతించింది. కానీ ఇప్పుడు తైవాన్ - చైనాల మధ్య యుద్ధం ఊపిరిపోసుకుంటోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సరిహద్దు ప్రాంతాలు భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లోకి 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత నాన్సీ పెలోసీ అడుగుపెట్టారు. దీంతో చైనా.. అగ్రరాజ్యంపై గరం అవుతోంది. నాన్సీ తైవాన్‌కి వస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చైనా వార్నింగ్ ల మీద వార్నింగ్‌లు ఇచ్చింది. డ్రాగన్ హెచ్చరికలను పట్టించుకోని తైవాన్ నాన్సీకి వెల్‌కమ్ చెప్పేసింది.

చైనా వార్నింగ్‌కు లైట్ తీసుకోకుండా తైవాన్ అప్రమత్తమైంది. చైనాతో యుద్ధానికి సిద్ధమైంది. ఆ దేశ మిలిటరీని హైఅలర్ట్ చేసింది. కొంతమంది అధికారులు, సైనికులకు సెలవులు కూడా రద్దు చేశారు. తక్షణమే యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ గగనతల రక్షణ దళాలకు ఆదేశాలు అందాయి.

చైనా వార్నింగ్‌లను తైవాన్ పట్టించుకోకపోవడంతో ఆ కంత్రీ కంట్రీ యుద్ధానికి కాలు దువ్వుతోంది. తాజాగా మరో యుద్ధవిమానాన్ని తైవాన్ భూభాగంలోకి పంపించింది. మరోవైపు తైవాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లను చైనా హ్యాక్ చేసింది.

తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా బలంగా నమ్ముతోంది. గతవారం ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫోన్ కాల్‌లో కూడా మాట్లాడారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని బాహాటంగానే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే తమకు ఎలాంటి దురుద్దేశం లేదని అమెరికా చెబుతోంది.

పెలోసీ తైవాన్ పర్యటన విషయంలో చైనా వ్యతిరేకిస్తుండటాన్ని బైడెన్ యంత్రాంగం ఘాటుగానే బదులిచ్చింది. ఆమె నచ్చిన చోటికి వెళ్లొచ్చని, తైవాన్‌లో పర్యటించే హక్కు సెనెట్ స్పీకర్‌కు ఉందని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు గెలుపొందాక 1949లో తైవాన్, చైనా వేరుపడ్డాయి. ఒకే దేశంగా కొనసాగుతామని అప్పట్లో ఇరు దేశాలూ చెప్పాయి. కానీ జాతీయ నాయకత్వం సూచించే ప్రభుత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. కానీ చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటు అమెరికా తన భారీ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తూ తైవాన్ కు అభయహస్తం అందిస్తోంది.

యూఎస్ హౌస్ స్పీకర్‌గా ఉన్న నాన్సీ పెలోసి 4 దేశాల ఆసియా పర్యటనలో ఉన్నారు. మంగళవారం రాత్రి మలేసియా నుంచి తైవాన్‌కు చేరుకున్నారు. తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య కొన్నాళ్ల నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టడంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. మరి చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందో అని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story