China Taiwan: తైవాన్ జలాల్లోకి దూసుకెళ్లిన చైనా యుద్ధనౌకలు..

China Taiwan: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్ మధ్య అగ్గి రాజేస్తోంది. తాజాగా చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు.. తైవాన్ సముద్ర జలాల్లోని మీడియన్ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్–బేస్డ్ మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్‌సైజ్ చేపట్టినట్లు పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com