తాలిబాన్లతో స్నేహం చేస్తాం : చైనా

X
ఆఫ్ఘనిస్థాన్‌లో అల్లకల్లోకం సృష్టిస్తున్న తాలిబన్లకు చైనా శుభవార్త అందించింది. తాలిబాన్లతో స్నేహం చేస్తామని కీలక ప్రకటన చేసింది. తాలిబాన్ల ప్రభుత్వంతో భవిష్యత్తులో వ్యాపార బంధాన్ని నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనితో చైనా వ్యవహార శైలి పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబూల్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పాకిస్తాన్, రష్యా, చైనా దేశాలు మద్దతు ఇస్తున్నాయని గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చైనా కీలక వ్యాఖ్యాలు చేసింది. కాగా ఆఫ్ఘనిస్థాన్ తో చైనాకు 76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
