China Taiwan War : మాటవినకుంటే దాడితప్పదని తైవాన్‌కు చైనా వార్నింగ్..

China vs Taiwan :డ్రాగన్ కంట్రీ.. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునేందుకు కుట్రలు చేస్తోంది. తైవాన్ సరిహద్దుల్లో చైనా భారీగా మిసైల్ దాడులకు తెగబడుతోంది. ఇటు తైవాన్ కూడా యూస్ సపోర్ట్‌తో తగ్గేదె లే అంటోంది. యూఎస్ ఆయుధాలతో దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక చైనా మరో ముందడుగు వేసి తైవాన్ అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. 22 ఏళ్ల తర్వాత చైనా విడుదల చేసిన శ్వేత పత్రంలో ఏముంది? చైనా శ్వేతపత్రానికి తైవాన్ రియాక్షన్ ఏంటి?
రష్యా మధ్య యుద్ధం ఇంకా ముగియనే లేదు. అప్పుడే మరో రెండు దేశాల మధ్య యుద్ధరాగాలు వినిపిస్తున్నాయి. అమెరికా చట్టసభల ప్రతినిధి నాన్సీ పేలోసీ తైవాన్‌లో పర్యటించినప్పటి నుంచి చైనా ఆదేశంపై గుర్రుగా ఉంది. ముందుగానే చైనా హెచ్చరికలు జారీ చేసినా అమెరికా పెడచెవిన పెట్టింది. ఇప్పుడు ఇదే అ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.
చైనా బాలిస్టిక్ క్షిపణులతో తైవాన్ సముద్ర జలాల్లో జారవిడిచింది. మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను ప్రదర్శిస్తూ తైవాన్ ను భయపెడుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలు, ఆకాశంలో ఎయిర్‌క్రాఫ్ట్స్, వార్‌షిప్స్‌తో మిలిటరీ డ్రిల్స్‌ప్రదర్శిస్తూ కయ్యానికి కాలుదువ్వడానికి సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉండగా తైవాన్‌లో వేర్పాటు వాదాన్ని అస్సలు సహించమని చైనా వెల్లడించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికైనా సిద్దమని స్పష్టం చేసింది. చైనాకు చెందిన తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఆర్థిక తాయిలాలు, సైనిక బలంతో తైవాన్‌పై ఎలా వశం చేసుకుంటామో.. దీనిలో స్పష్టంగా వెల్లడించింది చైనా.
తైవాన్ ప్రశాంతంగా చైనాలో విలీనం కావాలని సూచించింది. అదే సమయంలో ఏ విధమైన వేర్పాటు వాదానికి చోటు లేదని తెలిపింది చైనా. చైనా చివరిసారిగా 2000 సంవత్సరంలో శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారీ సైనిక విన్యాసాల మధ్య మరోసారి ఈ పత్రాన్ని విడుదల చేయడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com