China: ఆత్మహత్య చేసుకునే ముందు తృప్తిగా తినాలనుకున్నాడు.. కానీ ఆ ఫుడ్ ఆర్డరే..

China: ఆత్మహత్య చేసుకునే ముందు తృప్తిగా తినాలనుకున్నాడు.. కానీ ఆ ఫుడ్ ఆర్డరే..
China: సమస్య చిన్నది అయినా, పెద్దది అయినా.. ఈమధ్య చాలామంది దానికి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు.

China: సమస్య చిన్నది అయినా, పెద్దది అయినా.. ఈమధ్య చాలామంది దానికి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు. దాని వల్ల జీవితం ముగుస్తుంది తప్ప ఏ పరిష్కారం దొరకదు అని తెలిసినా చాలామంది అదే పరిష్కారం అని భ్రమపడుతుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కొందరికి ఓ సెకండ్ ఛాన్స్ లభిస్తుంది. ఆ సమయంలో వారిని కాపాడడానికి దేవుడే దిగి రావాల్సిన అవసరం లేదు.. ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చినా చాలు..

చైనాలోని ఓ వ్యక్తి తనకున్న ఆర్థిక సమస్యల వల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆత్మహత్య చేసుకునే ముందు తనకు నచ్చింది తిని చనిపోవాలని అనుకున్నాడు. అందుకే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. కానీ ఆర్డర్ పెట్టేటప్పుడు 'ఇదే నా లాస్ట్ మీల్' అనే నోట్‌ను కూడా అందులో కలిపాడు. ఫుడ్ ఆర్డర్ తీసుకొని డెలివరీ బాయ్ వచ్చి ఎన్నిసార్లు తలుపు కొట్టినా అతడు తీయలేదు. దాంతో పాటు ఆ నోట్ చూడగానే డెలివరీ బాయ్‌కు అనుమానం కలిగింది.

వెంటనే ఆ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి వస్తే అతడు కిటికీలో నుండి దూకేస్తానని బెదిరించాడు. కానీ అతడితో మాట్లాడి, పరిస్థితి మామూలు అయ్యేలా చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story