China: ప్రియుడు చేసిన మోసం.. ప్రియురాలు నిద్రపోతుండగా కనురెప్పలు పైకి లేపి అకౌంట్‌లో రూ.18 లక్షలు..

China: ప్రియుడు చేసిన మోసం.. ప్రియురాలు నిద్రపోతుండగా కనురెప్పలు పైకి లేపి అకౌంట్‌లో రూ.18 లక్షలు..
China: ఒక్కరోజులోనే తన ఖాతాలో భారీ లావాదేవీ జరిగినట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

China: అమ్మానాన్న కంటే అతడే ఎక్కువ.. అతడి మాయాలో పడి అన్నీ అర్పించేసింది.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమెకు అతడు మోసగాడని తెలియదు.. డబ్బు కోసమే తన చుట్టూ తిరుగుతున్నాడని పసిగట్టలేకపోయింది.. నిద్రిస్తున్నప్పుడు తన కనురెప్పలను పైకి లేపి మరీ అకౌంట్‌‌లో డబ్బు మాయం చేశాడని తెలుసుకుని ఆమె మనసు గాయపడింది.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ప్రియుడు హువాంగ్‌ని కటకటాల వెనక్కు పంపించింది.

ఈ అసాధారణ ఘటన చైనాలో జరిగింది.. అకౌంట్‌లో డబ్బుని ఇలా కూడా మాయం చేసే మోసగాళ్లు ఉంటారని తెలిసింది. తన మాజీ ప్రియురాలు నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫోన్ నుండి డబ్బు దొంగిలించిన ఆరోపణల్లో అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ చైనా కోర్టు తీర్పు చెప్పింది. మనీ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌లను లాగిన్ చేయడానికి ఫోన్‌లోని ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను ఉపయోగించి ఆమె ఖాతా నుంచి రూ.18 లక్షలు తన అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నాడు.

ఆమె యాక్సెస్ పొందిన తర్వాత, నిందితుడు ప్రియురాలి పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసి, బ్యాంక్ క్రెడిట్ ఖాతాల నుండి రూ. 18 లక్షలకు పైగా తరలించాడు. నివేదికల ప్రకారం, నిందితుడికి పెద్ద మొత్తంలో చేసిన అప్పుల కారణంగా నగదు అవసరం పడింది. దాంతో ప్రియురాలి ఖాతాకే టెండర్ పెట్టాడు.. అకౌంట్ ఖాళీ చేశాడు. తన తెలివికి తానే హాట్సాఫ్ చెప్పుకుంటూ.. ఎవరికీ దొరకననుకున్నాడు. కానీ అతడి ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది..

డబ్బు లావాదేవీలు జరిగిన ఒక్కరోజుకే తన ఖాతాలో భారీ లావాదేవీ జరిగినట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తులో ఆమె ప్రియుడే నేరస్తుడని తెలిసింది. న్యాయమూర్తి అతనికి మూడున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.

ఈ ఘటనపై చైనీస్ ఆన్‌లైన్ పేమెంట్ నెట్‌వర్క్ స్పందిస్తూ ఖాతాదారులు మరింత భద్రంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఏదైనా అసాధారణ కార్యకలాపాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కంపెనీ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story