Yuan Wang 5: శ్రీలంకకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ 5..

Yuan Wang 5: శ్రీలంకకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ 5..
Yuan Wang 5: శ్రీలంకలోని హంబట్‌ టోట రేవుకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ -5 చేరుకుంది.

Yuan Wang 5: శ్రీలంకలోని హంబట్‌ టోట రేవుకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ -5 చేరుకుంది. దీన్ని ధృవీకరించారు శ్రీలంక అధికారులు. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టింది భారత్‌. తక్షణమే స్పందించి శ్రీలంకకు తమ అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. కానీ ఇవేవి పట్టించుకోని చైనా. హంబట్‌ టోట రేవుకు చేర్చారు.

ఈ నౌక ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. గత వారం యువాన్‌ వాంగ్‌ హంబన్‌టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ఈ నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలంటూ చైనా అధికారులు లంక అధికారులను ప్రశ్నించారు. దీనికి సరైన వివరణ ఇవ్వలేకపోయారు శ్రీలంక అధికారులు. ఫలితంగా నౌకకు శనివారం అనుమతి మంజూరు చేశారు.

శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు కొలంబో అధికారులు చెబుతున్నారు. లంక జలాల్లో ఎలాంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించబోమని తెలిపారు. కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామంటున్నారు. అయితే.. హంబన్‌టొట అభివృద్ధికి చైనా 1.2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. శ్రీలంక ఆ రుణం చెల్లించలేకపోవడంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది బీజింగ్‌.

Tags

Read MoreRead Less
Next Story