Clive Jones: 129 పిల్లలకు తండ్రైన రిటైర్డ్ టీచర్.. అసలు ఇది ఎలా సాధ్యం..?

Clive Jones (tv5news.in)

Clive Jones (tv5news.in)

Clive Jones: ఇప్పటికీ తన స్పెర్మ్స్‌తో 129 మంది పిల్లలకు జన్మనిచ్చిన జోన్స్.. మరో తొమ్మిదిమందికి తండ్రి కానున్నాడు.

Clive Jones: స్పెర్మ్ డొనేషన్ అనేది ఇండియాలో చాలా అరుదుగా జరిగేది. కానీ ఫారిన్‌లో మాత్రం స్పెర్మ్ డొనేషన్ అనేది చాలా కామన్. ఎవరైనా స్పెర్మ్ డొనేట్ చేయొచ్చు. కానీ దానికి గరిష్ఠ వయసు 45 ఏళ్లు మాత్రం ఉండాలి. కానీ 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్ మాత్రం ఇంకా స్పెర్మ్ డొనేషన్ చేస్తూ.. ఇప్పటికీ 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం అంతటా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

58 ఏళ్ల వయసులో క్లైవ్ జోన్స్ అనే రిటైర్డ్ టీచర్ పిల్లలు లేనివారు ఎంత మానసిక వేదనకు గురవుతారో తెలుసుకున్నాడు. అందుకే తాను కూడా స్పెర్మ్ డోనర్‌లాగా మారాలనుకున్నాడు. యూకేలోని ఆసుపత్రులలో స్పెర్మ్ డోనర్‌లాగా పనిచేయాలనుకున్నాడు. కానీ అలా చేస్తే చాలామందికి రీచ్ అవ్వలేను అనుకున్న జోన్స్.. తానే సొంతంగా ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని స్పెర్మ్ డోనర్‌లాగా మారాడు.

ఇప్పటికీ తన స్పెర్మ్స్‌తో 129 మంది పిల్లలకు జన్మనిచ్చిన జోన్స్.. కొన్నిరోజుల్లోనే మరో తొమ్మిదిమందికి తండ్రి కానున్నాడు. అంటే ప్రస్తుతం తాను మొత్తం 138 స్పెర్మ్స్‌ను డొనేట్ చేశాడు. జోన్స్ మరికొన్ని సంవత్సరాలు ఇలాగే స్పెర్మ్స్‌ను డొనేట్ చేసి 150 మంది పిల్లలను కనాలని టార్గెట్ పెట్టుకున్నాడట. 1978లో పెళ్లి చేసుకున్న జోన్స్.. ప్రస్తుతం తన భార్యకు దూరంగా ఉంటూ స్పెర్మ్ డోనర్‌లాగా సెటిల్ అయిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story