Florida: ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్‌డౌన్.. నత్తలే కారణం..

Florida: ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్‌డౌన్.. నత్తలే కారణం..
Florida: నత్తలు అనేవాటిని ఆలస్యానికి ఉదాహరణగా వర్ణిస్తుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం నత్తలను చూస్తే భయపడుతున్నారు.

Florida: నత్తలు అనేవాటిని ఆలస్యానికి ఉదాహరణగా వర్ణిస్తుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం నత్తలను చూస్తే భయపడుతున్నారు. వాటి వల్ల ఏకంగా లాక్‌డౌన్‌నే విధించారు. నత్తల సైజు మామూలుగా చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఈ నత్తలు మాత్రం ఎలుక సైజు దాగా పెరుగుతాయి. ఇలాంటి వాటి వల్లే ప్రస్తుతం అమెరికాలో ఫ్లోరిడా వణికిపోతోంది. దాని వెనుక పెద్ద కారణమే ఉంది.

మామూలు సైజుకంటే పెద్దగా పెరిగే నత్తలను 'జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్' అంటారు. ఎనిమిది అంగుళాల పొడుగు ఉండే ఇవి.. తొమ్మిదేళ్ల పాటు జీవిస్తాయి. నీటిలో కాకుండా ఇవి ఎక్కువగా భూమిపైనే ఉంటాయి. మొక్కలు, చెట్ల ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ జాతి నత్తలు 1960లో అమెరికాకు చేరి అక్కడ కూడా విపరీతంగా విస్తరించాయి.

1960లోనే ఎంతో ఖర్చు చేసి దక్షిణా ఫ్లోరిడా ప్రభుత్వం ఈ నత్తలను నిర్మూలించింది. ఎందుకంటే ఈ నత్తల వల్ల చెట్లు, మొక్కలు పూర్తిగా దెబ్బతింటాయి. అంతే కాకుండా ఇవి కాంక్రీట్‌ను తింటాయి. దాని వల్ల భవన నిర్మాణాలపై ప్రభావం పడుతుంది. ఇక మనుషులకు కూడా వీటి వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఈ నత్తల వల్ల మనుషులకు మెనింజైటిస్ అనే వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

మెనింజైటిస్ అంటే మెదడుకు నీరు పట్టడం. ఇంకా దీని కారణంగానే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కొక్కసారి మనిషి చనిపోవచ్చు కూడా. నత్తలకు సహజ శత్రువులు లేకపోవడం వల్ల కూడా దీని వ్యాప్తిని అరికట్టడం కష్టమవుతుంది. అందుకే ఫ్లోరిడాలో రెండేళ్ల వరకు లాక్‌డౌన్ విధించారు. అంటే మొక్కలు, మట్టి, చెత్త, ఇంటి, భవన నిర్మాణానికి ఉపయోగపడే వస్తువులు లాంటివి ఒకచోట నుండి ఇంకొక చోటికి తీసుకువెళ్లకూడదు. పొలాలు, తోటల్లో వినియోగించే వాహనాలకు కచ్చితంగా ఎప్పటికి అప్పుడు సర్వీసింగ్ చేయించాలి అన్న రూల్స్‌ ప్రస్తుతం ఫ్లోరిడాలో అమలవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story