Phillipines : ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు..

Phillipines : ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు..
Phillipines : భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది.

Phillipines : భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది. ఈసారి భారీ స్థాయిలో రిక్టార్‌ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఉదయం 8.43 గంటల ప్రాంతంలో లుజోన్‌ ద్వీపంలోని ఆబ్రా ప్రావిన్స్‌ను భూకంపం తాకినట్లు పేర్కొంది.

మనీలాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎత్తైన భవనాలు కుదుపులకు లోనయ్యాయి. కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు పెటుడుతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అయితే ఈ భూకంప ప్రమాదంలో తొలుత ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేసినా.. పలు భవనాలు, చర్చీలు కూలిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది సుమారు 20కిపైగా తుపాన్లు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తుంటాయి.

ప్రపంచంలోనే అంత్యత విపత్తు ప్రాంతంగా నిలుస్తోంది ఈ దేశం. 1990లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు 7కుపైగా తీవ్రత నమోదవటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.



Tags

Read MoreRead Less
Next Story