Elon Musk: ఎలన్ మస్క్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. తనలో సగం వయసున్న నటితో..

Elon Musk: ఎలన్ మస్క్ అంటే టెక్ వరల్డ్‌లో తెలియని వారు ఉండరు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువమందికే తెలుసు. ఎలన్ మస్క్ విజయాల గురించి మాత్రమే ప్రపంచానికి ఎక్కువగా తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల టెక్ దిగ్గజం.. 27 ఏళ్ల నటితో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎలన్ మస్క్‌కు మొత్తం ఆరుగురు పిల్లలు. ముందుగా మస్క్.. కెనడాకు చెందిన రైటర్ జస్టిన్ విల్సన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ఒకసారి ఇద్దరు కవలలు పుట్టగా మరోసారి ఏకంగా ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది విల్సన్. ఇక పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత తాను నటి తాలూలా రిలేను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు విడాకుల తర్వాత కలిసి మళ్లీ విడిపోయారు. ఆ తర్వాత ఎలన్ మస్క్ పలువురితో డేటింగ్ చేశాడు.
కొన్నాళ్ల క్రితం ఎలన్.. కెనడా మ్యూజిషియన్ గ్రైమ్స్‌తో డేటింగ్ చేశాడు. వీరికి ఒక కొడుకు కూడా పుట్టిన తర్వాత వీరు విడిపోయారు. గతేడాది గ్రైమ్స్‌తో విడిపోయిన తర్వాత ఎలన్ సింగిల్‌గానే ఉన్నాడు. ఇక తాజాగా ఎలన్ మస్క్ తన ప్రైవేట్ జెట్‌లోనుండి ఒక అమ్మాయితో దిగడం చూసిన ఇంగ్లీష్ మీడియా ఆ అమ్మాయి ఎవరని ఆరాతీయడం మొదలుపెట్టింది.
ప్రస్తుతం ఎలన్ మస్క్ 27 ఏళ్ల ఆస్ట్రేలియన్ నటి నటాషా బస్సెట్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. నటాషా హీరోయిన్ మాత్రమే కాదు.. సోషల్ వర్కర్ కూడా. అయితే ఇంతకాలం సీక్రెట్‌గా సాగిన వీరి రిలేషన్ కొన్ని లీక్ అయిన ఫోటోల ద్వారా బయటికి వచ్చింది. దీంతో నటాషా కూడా తాను ఎలన్ మస్క్‌తో ప్రేమలో ఉన్నట్టు బయటపెట్టేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com