Elon Musk Twitter: ఎట్టకేలకు అనుకుంది సాధించిన ఎలన్ మస్క్.. రూ.3 లక్షల 34 వేల కోట్లతో..

Elon Musk Twitter: ట్విటర్‌ను 3 లక్షల 34 వేల కోట్లు పెట్టి కొనేశారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ కూడా వచ్చి చేరింది. కొన్ని రోజుల క్రితమే ట్విటర్‌లో 9 శాతం వాటా కొన్నారు మస్క్. ఈలోపే ఒక్కో షేర్‌కు 54 డాలర్లు ఆఫర్ చేసి మొత్తం 100 శాతం వాటానూ కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లని టెస్లా కంపెనీ ప్రకటించింది.
లిస్టెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకే ట్విటర్‌ను కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్విటర్ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టెస్లా డీల్ చాలా బాగుందంటూ పరాగ్ కితాబు ఇచ్చారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదన పట్ల ట్విటర్ బోర్డ్ సమగ్రంగా ఆలోచించిందని, ఈ డీల్‌తో ట్విటర్ స్టేక్ హోల్డర్లకు కూడా లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.
తన ఆధ్వర్యంలో ట్విటర్‌కు మరింత వాక్ స్వాతంత్రం వస్తుందన్నారు ఎలన్ మస్క్. కాని, ట్విటర్‌లో పూర్తి వాటా కొన్న తరువాత మరో రకమైన కామెంట్ చేశారు. తాను ఊహించినట్టుగా.. ట్విటర్‌లో వాక్ స్వేచ్ఛను పెంచలేమని, కొత్తగా ఎలాంటి స్వేచ్ఛనూ కల్పించలేమన్న విషయం పూర్తి వాటా కొన్న తరువాత తెలిసిందంటూ ఎలన్ మస్క్ మెసేజ్ పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com