Elon Musk : ట్విట్టర్‌పై మరోసారి ఎలాన్ మస్క్ ఫైర్..

Elon Musk : ట్విట్టర్‌పై మరోసారి ఎలాన్ మస్క్ ఫైర్..
Elon Musk : క్రిప్లోకరెన్సీ బైనాన్స్ సంస్థ సీఈఓ చాంగ్‌పెంగ్ ఝూవో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీ ఖాతా నుంచే అని ఎలాన్ స్క్రీన్‌షాట్ తీసిమరి పోస్ట్ చేశారు

Elon Musk : ట్విట్టర్‌పై మరో సారి విరుచుకుపడ్డారు ఎలాన్ మస్క్. గతంలో ట్విట్టర్ కొనుగోలుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకొని మళ్లీ వెనక్కితగ్గిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ట్విట్టర్లో ఉన్న ఫేక్, స్పామ్ ఖాతాలే అన్నారు మస్క్. ట్విట్టర్ అకౌంట్లలో 20 శాతం నకిలీవేనని ఎలాన్ మస్క్ చెప్పారు.

ఎలాన్ మస్క్‌కు కొందరు యూసర్లు రకరకాల ప్రశ్నలడుగుతారు. వాటిలో నచ్చినవాటికి ఎలాన్ మస్క్ రిప్తై ఇస్తారు. దీనిలో భాగంగానే ఎలాన్ మస్క్‌ను ఓ యూసర్... మీ పోస్ట్‌కు వచ్చే కామెంట్లలో ఎన్ని నకిలీవో చెప్పగలరా అని అడిగారు. దానకి సమాధానంగా.. 90 శాతం అని మస్క్ రిప్లై ఇచ్చారు.

క్రిప్లోకరెన్స్ బైనాన్స్ సంస్థ సీఈఓ చాంగ్‌పెంగ్ ఝూవో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీ ఖాతా నుంచే అని ఎలాన్ స్క్రీన్‌షాట్ తీసిమరి పోస్ట్ చేశారు. ట్విట్టర్‌ను గతంలో 44 బిలియన్ డాలర్లకు కొనడానికి మస్క్ సంసిద్ధత తెలిపారు. అయితే ఫేక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన ఆ డీల్ నుంచి తప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story