Elon Musk : ఎలాన్ మస్క్ పరాగ్‌తో అంత మాట అన్నాడా..?

Elon Musk : ట్విట్టర్ కొనుగోలును టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రద్దుకు ముందు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఓ కీలకమైన సందేశం పంపినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ కొనుగోలు చేసే దశలో ట్విట్టర్ న్యాయవాధులు ఆ నిధులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అడుగుతున్నారని. దీనితో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పరాగ్‌కు ఎలాన్ మస్క్ మెసెజ్ చేశారని బయటకు వచ్చింది.
ట్విట్టర్ ఫేక్ అకౌంట్లను కూడా ట్విట్టర్ బయటపెట్టకుండా దాచిపెడుతుందని మస్క్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఎలాగైనా ఇప్పటికిప్పుడు మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతుంది. అయితే మస్క్.. సమస్యలు, కేసులు పూర్తవడానికి నెలలు పట్టవచ్చు ఇప్పటికైతే కొనేదిలేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com