Elon Musk: సొంత ఇల్లు లేదు.. ఉన్న ఖరీదైన వస్తువు అదొక్కటే: ఎలన్ మస్క్

Elon Musk (tv5news.in)
Elon Musk: ఎవరైనా కాస్త డబ్బులు సంపాదించగానే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. విల్లా, కారులాంటివి కొనుక్కుంటారు. మరికొందరైతే.. ఖరీదైన యాచ్‌లు కూడా కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడైన ఎలన్ మస్క్ దగ్గర మాత్రం ఇవేవీ లేవని చెప్పి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికీ ఆయన సొంత ఇల్లు కూడా లేదన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టాడు ఎలన్.
పేపాల్ అనే ఇండస్ట్రీని స్థాపించి ఆ తర్వాత టెస్లాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు ఎలన్ మస్క్. అందరూ ఒకలాగా ఆలోచిస్తే.. తాను మాత్రం మరొకలాగా ఆలోచించి తన క్రియేటివిటీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల 2 బిలియన్ డాలర్లతో ట్విటర్‌లో మేజర్ షేర్ హోల్డర్ అయిపోయాడు. ఇక ట్విటర్‌ను కొనడం కోసం 43 బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినా.. అది ఎలన్ చేతికి దక్కలేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎలన్ మస్క్.. తనకు ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేదన్న విషయాన్ని బయటపెట్టాడు. టెస్లా ఇంజనీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు తను తరచుగా వెళ్లాల్సి వస్తుందని, అలాంటి సమయంలో తాను ఫ్రెండ్స్ ఇళ్లల్లోనే ఉంటానని చెప్పాడు ఎలన్. ఇల్లు మాత్రమే కాదు తనకు ఇంకే సౌకర్యవంతమైన వస్తువులు కూడా లేవు ఒక్క ప్రైవేట్ జెట్ తప్ప.
కేవలం విమానం మాత్రమే ఎందుకు కొనుగోలు చేశారు అనే ప్రశ్నకు ఎలన్ మస్క్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు. సొంత విమానం లేకపోతే తాను ఏ చోటికి వెళ్లాలని సమయం పడుతుందని, దాని వల్ల తను పనిచేసే సమయం తగ్గిపోతుంది అన్నారు ఎలన్. అందుకే ఆ ఇబ్బంది లేకుండా సొంత విమానం ఉండడం వల్ల తాను ఎక్కువ సమయం పనిచేయగలుతున్నా అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com