Emmanuel Macron: మరోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యూయెల్ మెక్రాన్..
By - Divya Reddy |25 April 2022 12:15 PM GMT
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు.
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మరీన్ లీ పెన్ పై ఆయన ఘన విజయం సాధించారు. 2017లోనూ వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. లీ పెన్ ఆలోచనలు, సిద్ధాంతాలు తీవ్రవాదాన్ని తలపిస్తున్నాయని..అవి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని అనేక మంది ముందస్తు సర్వేల్లో స్పష్టం చేశారు. ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని ఆమె నిషేధిస్తామనడాన్ని చాలా మంది ప్రస్తావించారు. అలాగే రష్యాతో ఆమెకున్న సంబంధాలు చర్చనీయాంశమయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com