Nigeria: ఫ్యాక్టరీలో పేలుడు.. ప్రమాదంలో 100మందికి పైగా మృతి..

Nigeria: ఫ్యాక్టరీలో పేలుడు.. ప్రమాదంలో 100మందికి పైగా మృతి..
Nigeria: పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో నిర్వాహకులు, అనుచరులు, వ్యాపారులు అందరూ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.

Nigeria: పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అగ్ని ప్రమాదాలు జరగడం మాత్రం ఆగట్లేదు. ఈ అగ్ని ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలు బలిదీసుకుంటూ.. వారి కుటుంబాలను చీకటిలోకి తోసేస్తున్నాయి. ఇటీవల నైజీరియా దేశంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏకంగా 100కు పైగా ఉద్యోగులు మృత్యువాత పడడం సంచలనంగా మారింది.

దక్షిణ నైజీరియాలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో ఇటీవల భారీ ప్రమాదం సంభవించింది. దాదాపు 100 మంది ఈ ప్రమాదంలో సజీవదహనమైనట్టు సమాచారం. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రమాదంలో ఎంతమంది మరణించారో అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి.

ఆఫ్రికాలో ఉన్న అక్రమ చమురు శుద్ధి కర్మాగారాల్లో ఇది పెద్దది. అయితే పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో నిర్వాహకులు, అనుచరులు, వ్యాపారులు అందరూ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. పేలుడు సంభవించగానే కొందరు అందులో సజీవదహనం కాగా మరికొందరు మాత్రం వారి ప్రాణాలు కాపాడడానికి కిటికీల్లో నుండి బయటికి దూకే ప్రయత్నం చేశారని వారు అన్నారు. అలా మరికొందరు మృతదేహాలు కూడా చెట్లకు వేలాడుతూ ఉన్నాయని వారు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story