Donald Trump: ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు.. అదే అనుమానంతో..

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను మార్-ఎ-లాగో ఎస్టేట్‌కి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేపట్టారు. అయితే ఈ వార్తలను అధికారులు ధ్రువీకరించలేదు కానీ. ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలకు కొద్ది సేపటి ముందు ఎఫ్‌బీఐ సిబ్బంది.. సీక్రెట్ సర్వీస్ అధికారులకు వారెంట్ విషయం వెల్లడించారు. దీంతో వారు వారెంట్లను పరిశీలించి అనుమతించారు. ఒక్కసారిగా 30 మంది సిబ్బంది మార్-ఎ-లాగోకు వచ్చారని ట్రంప్ కుమారుడు ఎరిక్ వెల్లడించారు.
ఎఫ్‌బీఐ తనిఖీలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకొన్నారని అన్నారు. ఇది దేశానికి చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా.. అనవసరంగా దాడులు నిర్వహించారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com