Finland: బయటికొచ్చిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని డ్రగ్ టెస్ట్ రిపోర్ట్..

Finland: ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ డ్రగ్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. డ్రగ్ పరీక్షలో ఆమె నెగటివ్‌గా తేలారు. ఇటీవల ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ పార్టీ చేసుకున్నారు. ఈ విందులో ప్రధాని తన మిత్రులతో కలిసి డ్యాన్స్ చేశారు. నేలపై మోకాళ్ల మీద కూర్చుని ఒక పాటకు స్టెప్పులెస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది.
దీనిపై విపక్ష నేతలు స్పందిస్తూ.. ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు మారిన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మారిన్ డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు. రిజల్ట్ నెగటివ్‌గా రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్స్‌తో జరిగిన పార్టీకి చెందిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంపై మారిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com