Ukraine: ఉక్రెయిన్‌లో బాంబు దాడి.. తొలి భారతీయ విద్యార్థి మృతి..

Ukraine: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన బాంబు దాడిలో భారత్ విద్యార్ధి మృతి చెందాడు. విద్యార్ధి మృతిని ధృవీకరించింది భారత విదేశాంగ శాఖ. భోజనం కోసం బయటికి వెళ్లిన సమయంలో బాంబు దాడి జరిగిందని, ఈ దాడిలోనే విద్యార్ధి చనిపోయినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇతన్ని కర్నాటకకు చెందిన వైద్య విద్యార్ధి నవీన్‌గా గుర్తించారు.
విద్యార్థి మరణాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది భారత్. రష్యా, ఉక్రెయిన్ రాయబారులకు విదేశాంగశాఖ సెక్రటరీ ఫోన్లు చేశారు. తక్షణం భారతీయులంతా సేఫ్‌గా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఖార్కీవ్‌తోపాటు మిగతా నగరాల్లో విద్యార్థులకు..రక్షణ కల్పించాలని విదేశాంగశాఖ సెక్రటరీ ఆరీందమ్ బాగ్చీ డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిని రాష్ట్రపతి కోవింద్‌కు వివరించారు కేంద్రమంత్రి జైశంకర్. ఖార్కీవ్ నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. సెంట్రల్ స్క్వేర్‌లోని ఖార్కీవ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌పై వాక్యూమ్ బాంబుతో దాడి చేసింది రష్యన్ ఆర్మీ. క్షణాల్లోనే బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. చుట్టుపక్కల భారీ మంటలు వ్యాపించాయి.
చుట్టుపక్కల సాధారణ పౌరులు తిరుగుతున్నా సరే.. బ్లాస్టింగ్‌కు వెనకాడడం లేదు. రష్యా చేసిన ఈ దాడిలో ఎంత మంది చనిపోయారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు అధికారులు. ఖార్కీవ్ బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు థర్మోబారిక్ వెపన్ ప్రయోగించిందని ఉక్రెయిన్ రాయబారి ఆరోపించారు. రష్యా ప్రయోగించింది సాధారణ బాంబ్ కాదంటున్నారు నిపుణులు.
వ్యాక్యూమ్ బాంబ్ లేదా థర్మోబారిక్ బాంబ్‌గా పిలిచే ఈ విధ్వంసకారిణి.. టార్గెట్ చేరుకోడానికి క్షణాల ముందు.. చుట్టుపక్కల గాలిలో ఆక్సీజన్‌ను తీసుకుని అత్యంత వేడిని పుట్టిస్తుంది. అలాగే అత్యంత ఒత్తిడితో కూడిన షాక్ వేవ్స్‌ను కూడా సృష్టిస్తుంది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో ఓ వ్యాక్యూమ్‌ను క్రియేట్ చేస్తుంది. ఇది ట్రెడిషనల్ ఎక్స్‌ప్లోజివ్స్‌కు భిన్నంగా.. ఎక్కువ సేపు అత్యధిక వేడిని, బ్లాస్ట్ వేవ్స్‌ని పంపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com