Gonzalo Montoya Jimenez: చనిపోయాడని పోస్టుమార్టం ప్రారంభించారు.. ఇంతలోనే..
Gonzalo Montoya Jimenez: ఒక్కొక్కసారి కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఒక్కొక్కసారి అవి మనిషి ప్రాణాలకు కూడా ప్రమాదకరం కావచ్చు. తాజాగా అలాంటి ఓ ఘటనే స్పానిష్‌లో జరిగింది. ఓ ఖైదీ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసిన జైలు అధికారులు తనను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జరిగినదంతా వారందరికీ నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్న విషయమే.
గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ తెల్లవారుజామున అధికారులకు అపస్మారక స్థితిలో కనిపించాడు. అయితే అతడు చనిపోయాడేమో అని భావించిన అధికారులు తనను ఆసుపత్రికి తరలించారు. అతడు మరణించిన విషయాన్ని కోర్టుకు కూడా తెలిపారు. అక్కడి వైద్యులు కూడా జిమెనెజ్ మరణించాడనే అన్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
జిమెనెజ్ మరణించాడని ధృవీకరించడంతో అతడిని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి కూడా తరలించారు. కానీ అక్కడి వైద్యులు జిమెనెజ్ గుండె ఇంకా కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. అంతే కాకుండా అతడి శరీరాన్ని పెట్టిన బ్యాగ్‌లో నుండి సౌండ్స్ రావడం కూడా గమనించారు. దీంతో అతడు ఇంకా బ్రతికే ఉన్నాడని వైద్యులు కన్ఫర్మ్ చేసుకున్నారు.
జిమెనెజ్ చనిపోయినట్టు నిర్ధారించిన వైద్యులు మాత్రం అతడి శరీరం ఆక్సిజన్ లెవెల్ లేకపోవడం వల్ల రంగు మారిందని కూడా అన్నారు. కానీ జిమెనెజ్ బ్రతికే ఉండడం వల్ల వారిపై ఛార్జీలు పడ్డాయి. అంతే కాకుండా వైద్యం కోసం జిమెనెజ్‌ను మరో ఆసుపత్రికి కూడా తరలించారు పోలీసు అధికారులు. ఇలాంటి ఘటన జరగడం ఇదేమీ తొలిసారి కాదు.. తాజాగా కెన్యాలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com