Florida Floods : ఫ్లోరిడాలో భయానకంగా తుఫాన్, వర్షాలు.. ఇళ్లల్లోకి వస్తున్న సొరచేపలు..

Florida Floods : అమెరికాలోని ఫ్లోరిడా వణికిపోతోంది. భీకర గాలులు, వరదలతో అతలాకుతలం అవుతోంది. సముద్రంలో ఉండాల్సిన రాకసి సొరచేపలు రోడ్లపై, షాపింగ్స్ మాల్స్‌పై దర్శనమిస్తున్నాయి. దీంతో అడుగు బయటవేయాలంటేనే జనం భయపడిపోతున్నారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఇయన్' హరికేన్ ప్రచండ వేగంతో అమెరికా తీరాన్ని తాకింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వానలు దంచికొడుతున్నాయి. దీంతో ఫ్లోరిడా ఒక్కసారిగా అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి.
ఎక్కడికక్కడ ఇయన్ సృష్టించిన భారీ విధ్వంసంతో ఫ్లోరిడాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వరద నీరు నదిని తలపించేలా ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లపై ఉన్న కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. గాలుల వేగానికి చెట్లు వేళ్లతో సహా పెకలించుకొని కూలిపోయాయి.
ప్రజలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఫ్లోరిడాతో పాటు వర్జీనియా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com