Pakistan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. అవిశ్వాస తీర్మానం తప్పదు..
Imran Khan (tv5news.in)
Pakistan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాకే తగిలింది. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న ఓటింగ్‌ను నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇమ్రాన్ పార్టీకి చెందిన కొందరితో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలకు చెందిన కొందరు విపక్షంతో చేరిపోయారు. దీంతో తమ ప్రభుత్వ మనుగడ కోసం ఓ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఇమ్రాన్... పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌తో ఓ ప్రకటన చేయించారు.
ఇమ్రాన్ వ్యూహం మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్.. ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ పరిణామంపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇందుకోసం జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com