Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Indonesia: ఫారిన్ దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

Indonesia: ఫారిన్ దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా టోర్నడో సంభవించి చాలామంది ప్రాణాలను బలిదీసుకుంది. అమెరికాలో పలు ప్రాంతాల్లో ప్రజల జీవితాలు పూర్తిగా చీకటయిపోయాయి. ఉండడానికి చోటు లేక కష్టపడుతున్నారు. ఇప్పుడు మరో ఫారిన్ దేశంలో తీవ్రమైన భూకంపం వచ్చింది. దీని వల్ల ప్రాణనష్టం ఏమీ జరగకపోయినా భూకంపం తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉంది.

ఇండోనేషియాలోని మౌమెరికి 95 కిలోమీట‌ర్ల ఉత్తరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత‌ 7.6గా ఉన్నట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్లడించింది. ఫ్లోరేస్ స‌ముద్రంలో సుమారు 18.5 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు తెలిపింది. దీంతో ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరికలను జారీ చేశారు.

ఫ్లోరేస్ స‌ముద్రంలో సుమారు తెల్లవారుజామున 3. 20 నిమిషాల‌కు భూకంపం వ‌చ్చినట్టు కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి సుమారు వెయ్యి కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప్రమాద‌క‌ర‌మైన సునామీ త‌రంగాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నట్లు ప‌సిఫిక్ సునామీ వార్నింగ్ సెంట‌ర్ హెచ్చరికలు జారీచేసింది.

Tags

Read MoreRead Less
Next Story