New Delhi : భారత్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవు : కేంద్ర మంత్రి జైశంకర్

New Delhi : భారత్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవు : కేంద్ర మంత్రి జైశంకర్
New Delhi : శ్రీలంకలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో భారత్​లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Delhi : శ్రీలంకలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో భారత్​లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ క్లారిటీ ఇచ్చారు. దేశంలో సరిపడా నిధులు ఉన్నాయని.. అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భoగా తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై అధికారులు ప్రజంటేషన్‌ ఇవ్వడం, దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర విమర్శలు చేయడంపై ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాలు దొరకడం లేదు. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్ని చూసి భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుడంటంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. దీనికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా ప్రసంగించిన జైశంకర్‌..... భారత్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తుతాయన్న ప్రశ్నను కొట్టిపారేశారు. భారత్‌లోనూ అలాంటి పరిస్థితి రావచ్చా?' అన్ని ప్రశ్నకు.. క్లారీటీ ఇచ్చారు మంత్రి జైశంకర్‌. దేశంలో సరిపడా నిధులు ఉన్నాయని, శ్రీలంకలాంటి పరిస్థితులు భారత్‌కు రాబోవన్నారు.

శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో భారత్లో రాష్ట్రాల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు. ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై రెండవ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దేశంలో 10 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాని తెలిపారు. ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులు చేటు చేస్తాయన్నారు. ఏపీ, తెలంగాణలోనూ అప్పులు మితిమీరాయన్నారు కేంద్ర అధికారులు.

అధికారుల వివరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంపీలు. తెలంగాణ అప్పుల ప్రస్తావన రాగానే టీఆర్‌ఎస్‌ ఎంపీలు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారమే అప్పులు తెచ్చామంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.కేంద్ర అధికారుల వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీలంక పరిస్థితి చెప్తూ రాష్ట్రాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. ఏపీ ఎంపీలు సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు.

మొత్తానికి....కేంద్రం.. శ్రీలంక పరిస్థితులపై చర్చిస్తున్న సమయంలో...తెలంగాణ, ఏపీల పరిస్థితిపై అనేక విమర్శలు చేయడంపై, దీనికి టీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్‌ ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story