Joe Biden : జో బైడన్‌కు కరోనా.. వైట్ హౌస్‌లోనే ఐసొలేషన్

X
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. కరోనా బారిన పడ్డ బిడెన్‌కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఆయన అధ్యక్షభవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసును బిడెన్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడ్డారు. ఐసోలేషన్‌లో ఉంటూనే బైడన్ అధికారిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
