Jonathan Ma: జాక్‌పాట్‌ కొట్టిన అమెరికన్‌ యూట్యూబర్‌.. సెకన్ల వ్యవధిలో రూ.కోటి 75 లక్షలు..

Jonathan Ma: జాక్‌పాట్‌ కొట్టిన అమెరికన్‌ యూట్యూబర్‌.. సెకన్ల వ్యవధిలో రూ.కోటి 75 లక్షలు..
X
Jonathan Ma: అమెరికాకు చెందిన జోనాథన్ మా అనే యూట్యూబర్‌ ఓవర్‌ నైట్‌ కోటిశ్వరుడయ్యాడు.

Jonathan Ma: అమెరికాకు చెందిన జోనాథన్ మా అనే యూట్యూబర్‌ ఓవర్‌ నైట్‌ కోటిశ్వరుడయ్యాడు. కేవల సెకన్ల వ్యవధిలో కోటి 75 లక్షలు సంపాదించాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్‌-ఫంగబుల్‌ టోకెన్‌లతో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాన్ని సంపాదించి ఓవర్‌ నైట్ సెన్సెషన్‌గా మారాడు. ఇలా వచ్చిన డబ్బుతో సినిమా నిర్మాత కావాలనే కోరిక మరికొద్ది రోజుల్లోనే తీరనున్నట్లు చెప్తున్నాడు.

ఈయన గతంలో ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూ ట్యూబర్‌ జోమా టెక్‌ పేరుతో షేర్ చేస్తుంటాడు. ఇతని ఛానెల్‌కు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐతే ఈ నెల ప్రారంభంలో వ్యాక్సీడ్‌ డాగ్‌గోస్‌ పేరు నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ కలెక్షన్‌ విడుదల చేశారు. ఇదే ఆయనకు కోటి 75 లక్షల రూపాయలను తెచ్చిపెట్టింది. అది కేవలం 42 సెకన్లలోనే ఖర్చులు పోనూ..కోటి 40 లక్షలు మిగిలాయని అంచనా వేస్తున్నారు.

Tags

Next Story