UAE: జస్టిస్ ఎన్వీ రమణ అధికారిక యూఏఈ పర్యటన..ఘన స్వాగతం పలికిన ప్రవాసీయులు

UAE: జస్టిస్ ఎన్వీ రమణ అధికారిక యూఏఈ పర్యటన..ఘన స్వాగతం పలికిన ప్రవాసీయులు
UAE: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సతీసమేతంగా యూఏఈ విచ్చేయటం జరిగింది.

UAE: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సతీసమేతంగా యూఏఈ విచ్చేయటం జరిగింది. "ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా అఫ్ గ్లోబలైసేషన్" పేరిట మార్చి 19న దుబాయ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే నిమిత్తం సీజేఐ దుబాయ్ విచ్చేసారు. జస్టిస్ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, యల్. నాగేశ్వర రావు, హిమా కోహ్లీ కూడా దుబాయ్ విచ్చేసారు.

ఈ సందర్భంగా దుబాయ్ లోని తెలుగు వారు, న్యాయవాదులు, పారిశ్రామకవేత్తలు, వ్యాపారవేత్తలు..జస్టిస్ రమణ దంపతులకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం భారత రాయబార మరియు కాన్సులేట్ అధికారులతో సీజేఐ సమావేశమై తదుపరి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. తమ పర్యటనలో భాగంగా అబుధాబి, దుబాయ్ లోని ఇండియన్ అసోసియేషన్లు నిర్వహించే 'మీట్ & గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని ప్రవాసీయులతో జస్టిస్ రమణ ముచ్చటించనున్నారు.


భారత అత్యుత్తమ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి మన తెలుగువారు కావటం ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారి అందరికి ఎంతో గర్వకారణం..సీజేఐ ను ఇలా దుబాయ్ లో కలుసుకోవటం మాకు ఓ గొప్ప అనుభూతిని మిగిల్చింది అంటూ స్వాగతం పలికేందుకు విచ్చేసిన తెలుగువారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story