Kate Winslet: అతడిని చూసి ఏడుపు ఆపుకోలేకపోయాను.. టైటానిక్ నటి భావోద్వేగం..

Kate Winslet: అతడిని చూసి ఏడుపు ఆపుకోలేకపోయాను.. టైటానిక్ నటి భావోద్వేగం..
X
Kate Winslet: ఇద్దరూ కలుసుకుని టైటానిక్ షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

Kate Winslet: హాలీవుడ్ మూవీ టైటానిక్ వచ్చి 24 ఏళ్లైనా అందులో నటించిన కేట్ విన్స్‌లెట్, లియోనార్డో డికాప్రియో సినిమా ప్రియులకు గుర్తుండిపోతారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో వారి వయసు 21, 22 ఏళ్లు. 2008లో రివల్యూషనరీ రోడ్‌లో వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించారు.

అలా వారిద్దరి మధ్య బలమైన స్నేహం కొనసాగింది.. తరుచు కలుసుకోవడం, ఫోన్ మాట్లాడుకోవడం జరుగుతుండేది.. కానీ గత మూడేళ్ల నుంచి కోవిడ్ కారణంగా ఒకరినొకరు కలుసుకోవడానికి వీలు పడలేదు. ఇటీవల డికాప్రియోని కలిసిన కేట్ సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.

ఆనందంతో ఏడ్చేసింది.. కోవిడ్ కారణంగా చాలా మంది స్నేహితుల మాదిరిగానే మేము కూడా ఒకరినొకరు కలుసుకోలేకపోయాము. ఇద్దరూ కలుసుకుని టైటానిక్ షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

Tags

Next Story