KTR: మన ఊరు-మన బడిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలి: కేటీఆర్

KTR: సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోన్న విద్యా యజ్ఞంలో NRIలు భాగస్వామ్యం కావాలని.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. న్యూజెర్సీలోని ఎడిషన్ టౌన్‌షిప్‌లో మన ఊరు-మనబడి NRI పోర్టల్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు.. వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ యజ్ఞంలో భాగంగా 26వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 7వేల 300కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో భారీగా NRIలు భారీగా విరాళాలు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com